ETV Bharat / crime

ఘరానా మోసం.. లక్షలు స్వాహా చేసిన ఏటీఎంలో నగదు పెట్టే సిబ్బంది - ATM staff has stolen money in mahabubabad district

ఏటీఎంలో పెట్టే నగదును కొట్టేసిన సిబ్బంది

author img

By

Published : Oct 22, 2021, 1:18 PM IST

Updated : Oct 22, 2021, 1:54 PM IST

13:14 October 22

మహబూబాబాద్ జిల్లాలో ఘరానా మోసం

మహబూబాబాద్ జిల్లాలో ఘరానా మోసం బయటపడింది. ఏటీఎంలో నగదు పెట్టే సిబ్బందే.. ఆ నగదును కాజేసిన సంఘటన చోటుచేసుకుంది. ఏటీఎంలో పెట్టాల్సిన నగదును కొంత మంది సిబ్బంది విడతల వారీగా కొట్టేశారు. రూ.52 లక్షలు కాజేసిన ఈ ముఠా.. మోసం బయటకు పొక్కకుండా ఏటీఎంను తగులబెట్టించి డబ్బు కాలిపోయిందని నాటకం ఆడించింది.

ఏటీఎం దగ్ధమైన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. ఏటీఎంలో నగదు పెట్టే సిబ్బంది ముఠాగా ఏర్పడి విడతల వారీగా రూ.52 లక్షలు కాజేసినట్లు వెల్లడైంది. ఈ మోసానికి పాల్పడిన 8 మందిలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు సిబ్బంది పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి పోలీసులు రూ.6.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఫ్లాట్ల కాగితాలు సీజ్ చేశారు. ఈ ఘటన వివరాలను ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. 

Last Updated : Oct 22, 2021, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.