జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలంలో 35ఏళ్ల వక్తి తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడం వల్ల గ్రామ పెద్దల సమక్షంలో కాళ్లబేరానికొచ్చాడు. ఎకరం పొలం ఇస్తానని పంచాయతీలో చెప్పాడు. అందుకు బాలిక తల్లిదండ్రులు అంగీకరించలేదు. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏమి జరిగిందంటే..
ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికపై అత్యాచారం చేశాడు. తమ కుమార్తె ఎప్పటికీ ఇంటికి రాకపోవడం వల్ల గాలించిన తల్లిదండ్రులు జరిగిన దారుణాన్ని తెలుసుకుని నిందితుడిని పట్టుకున్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్టు చేసిన రిమాండ్కు తరలించారు.
ఇదీ చూడండి: లైవ్ వీడియో: భవనం పైనుంచి దూకి మహిళ బలవన్మరణం