ETV Bharat / crime

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా... మరో ఐదుగురికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

3 people died in road accident in peddavura, nalgonda district
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
author img

By

Published : May 7, 2022, 10:10 PM IST

నల్గొండ జిల్లా పెద్దవూరలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని గుర్రంపోడు మండలం తేనేపల్లి తండాకు చెందిన సురేశ్ తన కారులో మిర్యాలగూడలోని ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో పెద్దవూరలో ఎదురుగా వచ్చిన టాప్ సీలింగ్ లోడ్​తో వాహనం ఢీకొనడంతో.. ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో కారు డ్రైవర్ సురేశ్... అక్కడిక్కడే మృతి చెందారు. అతని తల్లి చారు(47), తన కుమార్తె(15నెలల పాప) నల్గొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. టెంపో డ్రైవర్​ రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.