రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ వద్ద జాతీయ రహదారి బైపాస్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి జూరాలకు వెళ్తున్న కారు... బెంగళూరు జాతీయ రహదారిపై అన్నారం వై-జంక్షన్ వద్ద అదుపుతప్పింది. వేగంగా డివైడర్ పైకి దూసుకెళ్లి.... మరోవైపు నుంచి షాద్‌నగర్ వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఇంకో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలోనే చనిపోయిన వారు... హైదరాబాద్ మలక్‌పేట్‌కు చెందిన సయ్యద్ అబ్ధుల్ ఉమర్, బోరబండకు చెందినవారిగా... ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది హసన్‌గా గుర్తించారు. మరో వ్యక్తి హరీశ్ శంషాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.