ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల నుంచి జహీరాబాద్‌కు తరలిస్తున్న ఎండు గంజాయిని పటాన్చెరు టోల్గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. 280 కిలోల గంజాయి, ఓకారును సీజ్‌చేశారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్పూర్ తండాకు చెందిన బానోతు తులసీరామ్, నాల్కల్ మండలం రామతీర్థకు చెందిన బ్యాగరి తుకారాం... ఏపీ నుంచి జహీరాబాద్‌కు గంజాయి తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న మెదక్ డివిజన్ అబ్కారీ, ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు... సూపరింటెండెంట్ గాయత్రి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. స్కార్పియో వాహనంలో 140 ప్యాకెట్లలో తీసుకెళ్తున్న 280కిలోల గంజాయిని పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి... ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చూడండి: కొవిడ్ చికిత్స పొందుతున్న నేవీ ఉద్యోగి ఆత్మహత్య.. కారణమేంటంటే?