హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యాపారులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.55 లక్షలు విలువైన 265 కిలోల గంజాయిని సీజ్ చేశారు.
హైదరాబాద్ మీదుగా గంజాయి తరలింపు ఎక్కువగా జరుగుతోందని.. గంజాయి తరలింపు కట్టడికి నగర పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని మాదాపూర్ పోలీసులు తెలిపారు. ఎక్కడికక్కడ గాంజా తరలింపును కట్టడి చేస్తామని చెప్పారు.
పరారీలో మరో నిందితుడు..
'మాదాపూర్ రైల్వే స్టేషన్ వద్ద గంజాయి లోడ్‌తో ఉన్న ట్రక్‌ను గుర్తించాం. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా ఉత్తర్‌ప్రదేశ్‌కు ఓ ముఠా ఈ గంజాయిని తరలిస్తోంది. ఆ ముఠాలో ముగ్గురు నిందితులు ఉన్నారు. వారంతా యూపీకి చెందిన వారే. మొత్తం రూ.55 లక్షలు విలువ చేసే గాంజా ఉంది. కిలో రూ.8 వేలకు కొనుగోలు చేసి రూ.15వేలకు విక్రయిస్తున్నట్లు నిందితులు చెప్పారు. ముగ్గురిని అరెస్టు చేశాం. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నాం. త్వరలోనే పట్టుకుంటాం. '
- శిల్పవల్లి, మాదాపూర్ డీసీపీ
ఇదీ చదవండి : CP Stephen on Drugs Gang Arrest : గంజాయి తరలింపు ముఠా అరెస్టు.. పరారీలో సూత్రధారులు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!