సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ వద్ద భారీగా గంజాయి(Cannabis) పట్టుబడింది. 240 కిలోల ఎండు గంజాయి(Cannabis)ని మునిపల్లి పోలీసులు పట్టుకున్నారు. విశాఖ నుంచి ముంబయి తరలిస్తుండగా.. సంగారెడ్డి జిల్లా కంకోల్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన ఓ బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా.. అందులో కూరగాయల పెట్టెలున్నాయి. పెట్టల్లో కూరగాయలు కాకుండా ఇంకేమైనా ఉన్నాయని తనిఖీ చేయగా.. 240 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లు కనిపించాయి.
240 కిలోల గంజాయి(Cannabis)ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని విలువ దాదాపు రూ.8 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. గంజాయితో పాటు బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకుని, వాహన డ్రైవర్ను అరెస్టు చేశారు. పెట్టెల్లో గంజాయి ప్యాకెట్లు ఉంచి.. వాటిపై కూరగాయలు కప్పి కవర్ చేశారని మునిపల్లి ఎస్సై మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
- ఇదీ చదవండి : ఆస్తి పంచడం లేదని ఓ కోడలు ఎంతకి తెగించిందంటే..