ETV Bharat / crime

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - srinivasapuram road accident updates

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ లారీ ఆగివున్న ట్రాక్టర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితులను మంత్రి ఆళ్ల నాని, పలువురు ఎమ్మెల్యేలు పరామర్శించారు.

20members-injured-due-to-lorry-hit-by-tractor-at-srinivasapuram-in-west-godavari-district
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
author img

By

Published : Mar 7, 2021, 1:58 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ట్రాక్టర్​ను ఓ లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 22 మందికి తీవ్ర గాయాలవ్వగా... వారిలో ఇద్దరు మృతి చెందారని అధికారులు వెల్లడించారు.

ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామానికి చెందిన కొందరు పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం గ్రామ సమీపంలోని గుబ్బల మంగమ్మ ఆలయానికి ట్రాక్టర్​పై వెళ్తున్నారు. జంగారెడ్డిగూడెం సమీపంలోని శ్రీనివాసపురం జంక్షన్ వద్ద వాహనాన్నిఆపి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఒడిశా వైపుగా వెళ్తోన్న మధ్యప్రదేశ్​కు చెందిన ఓ లారీ అతి వేగంగా ట్రాక్టర్​ను వెనకనుంచి ఢీకొట్టింది.

20members-injured-due-to-lorry-hit-by-tractor-at-srinivasapuram-in-west-godavari-district

బాధితులంతా కూలీలే..

ఈ ప్రమాదంలో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన జంగారెడ్డిగూడెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గురైన వారందరూ కూలీలని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన బాధితులను మంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అబ్బయ్యచౌదరి పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: ట్రాక్టర్ బీభత్సం... నలుగురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.