ETV Bharat / crime

జయశంకర్ వర్సిటీలో ర్యాగింగ్.. 13 మంది ఏడాది పాటు సస్పెండ్ - జయశంకర్ వర్సిటీలో ర్యాగింగ్

Ragging in Jayashankar University: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీలో ర్యాగింగ్‌ కలకలం రేపింది. జూనియర్లను తమకు గదికి పిలిచి వికృతంగా ర్యాగింగ్ చేయడంతో జూనియర్లు సీనియర్లపై ర్యాగింగ్ స్క్వాడ్‌కు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్ చేసిన 20 మంది సీనియర్లపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.

Ragging in Jayashankar University
Ragging in Jayashankar University
author img

By

Published : Jul 29, 2022, 2:17 PM IST

Ragging in Jayashankar University: ర్యాగింగ్‌పై ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా.. ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. కళాశాలల యాజమాన్యాలు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా కొన్ని చోట్ల ఈ ర్యాగింగ్ భూతం విద్యార్థులను వదలడం లేదు. కొంతమంది ర్యాగింగ్ తట్టుకోలేక చదువు మానేస్తే.. మరికొంత మంది మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయినా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ర్యాగింగ్‌కు అడ్డుకట్ట వేయలేేకపోతోంది. తాజాగా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది.

వసతిగృహంలో జూనియర్లను తమ గదికి పిలిపించి సీనియర్లు వికృత చేష్టలకు పాల్పడ్డారు. రాగింగ్‌ స్క్వాడ్‌కు జూనియర్లు ఫిర్యాదు చేయడంతో.... అధికారులు 20 మంది సీనియర్లపై వేటు వేశారు. 13 మంది విద్యార్థులను హాస్టల్‌ నుంచి ఏడాది పాటు, 7 మంది విద్యార్థులని ఒక సెమిస్టర్‌ పాటు సస్పెండ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.