ETV Bharat / crime

Baby Girl Died in BommalaRamaram : నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి - Bhuvanagiri district news

నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి
నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి
author img

By

Published : Oct 14, 2021, 12:40 PM IST

Updated : Oct 14, 2021, 1:14 PM IST

12:38 October 14

Baby Girl Died in BommalaRamaram : నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి

అప్పటిదాకా కళ్ల ముందే ఆడుకున్న పాప అకస్మాత్తుగా కనిపించలేదు. ఎటు వెళ్లిందా అని ఇళ్లంతా వెతికారు. ఇప్పుడిప్పుడే నడక నేర్చిన ఆ చిన్నారి బయటకు వెళ్లిందేమో అని ఇంటి బయటా చూశారు. చుట్టుపక్కలా వెతికారు. ఎక్కడా కనిపించకపోయేసరికి.. ఇంటికి వచ్చిన వారికిె ఎదురుగా సంపు కనిపించింది. దేవుడా ఏం కావొద్దని ప్రార్థిస్తూనే సంపు(Baby Girl Died in BommalaRamaram)లో చూశారు. ఒక్కసారిగా ఆ దృశ్యం చూసి గుండెపగిలేలా ఏడ్చారు. 

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో నీటి సంపులో పడి(Baby Girl Died in BommalaRamaram) రెండేళ్ల చిన్నారి నిహారిక మృతి చెందింది. పాప మృతితో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కంటిపాప కళ్లకు కనిపించకుండా పోయిందని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి రోదనలు చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. 

Last Updated : Oct 14, 2021, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.