Fake Notes at Madhapur : హైదరాబాద్ మాదాపూర్‌లో నమూనా రెండు వేల నోట్ల కాగితాలు కలకలం సృష్టించాయి. బుధవారం ఉదయం కాకతీయహిల్స్ కమాన్ సమీపంలో రోడ్డుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కొన్ని నమూనా రెండు వేల నోట్ల కాగితాలను రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు.
![Fake Notes at Madhapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14173282_laaaa.jpg)
![Fake Notes at Madhapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14173282_aa.jpg)
Fake Rs.2000 Notes at Madhapur : అటువెళ్తున్న స్థానికులు, వాహనదారులు వాటిని నిజమైన నోట్లుగా భావించి తీసుకునేందుకు పోటీపడ్డారు. తీరా వాటిని పరిశీలిస్తే, అవి నమూనా కాగితాలుగా తేలడంతో అంతా ఉసూరుమన్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచామూ లేదని మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ రవీంద్రప్రసాద్ చెప్పారు.