నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బాపన్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాత పడగా.. పలువురికి గాయాలయ్యాయి. బాపన్‌పల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటేశ్వర ఆలయానికి ఇచ్చేందుకు గ్రామస్థులు దాతల సహకారంతో ఇనుప రథాన్ని తయారు చేయించారు. రథ సప్తమి మంచిరోజు కావడం వల్ల రథాన్ని దేవునికి అంకితమిచ్చేందుకు తీసుకువెళ్తున్నారు.
ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతం ఏర్పడింది. రథాన్ని లాగుతున్న వారికి కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన నారాయణపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడ సంజనోల్ల చంద్రప్ప, హనుమంతు ప్రాణాలు కోల్పోయారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షత్రగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రేమించాలని ఎయిర్‌గన్‌తో బెదిరింపులు