ETV Bharat / crime

hyderabad rape case: ఆగని అకృత్యాలు.. హైదరాబాద్‌లో మరో బాలికపై అత్యాచారం - తెలంగాణ వార్తలు

17-years-old-girl-raped-accused-arrested-in-hyderabad

author img

By

Published : Oct 6, 2021, 1:31 PM IST

Updated : Oct 6, 2021, 4:55 PM IST

13:31 October 06

హైదరాబాద్‌లో పదిహేడేళ్ల బాలికపై అత్యాచారం

మహిళలపై మృగాళ్ల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఒక ఘటన జరిగి అందులో నుంచి తేరుకోకముందే మరోటి వెలుగు చూస్తూనే ఉంది. నిత్యం ఎక్కడో ఒకచోట కామాంధుల దాటికి మగువలు బలవుతూనే ఉన్నారు. అమ్మాయిల్లో బోజ్యేశు మాతను చూడటం మానేసి.. శయనేశు రంభను మాత్రమే చూస్తూ కీచకులు ఎగబడిపోతున్నారు. వావివరసలు, చిన్నాపెద్ద తేడా లేకుండా.. విచక్షణారహితంగా అఘాయిత్యాలకు పాల్పడుతూన్నారు.

హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో జరిగిన ఆరేళ్ల బాలిక హత్యాచార ఘటన మరువక ముందే.. పదిహేడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ మానవమృగం. మహేశ్‌ అనే కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు మహేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్​లో ఇటువంటి వరుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. 

విచ్చలవిడి మద్య సేవనమో.. వినాశకాల బుద్ధో.. మానవులు కాస్తా కామానవులు అవుతున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. ఇంకెన్ని చట్టాలొచ్చినా.. అవేవీ కామాంధుల అకృత్యాలకు కళ్లెం వేయలేకపోతున్నాయి. సింగరేణి కాలనీలో ముక్కుపచ్చలారని ఆరేళ్ల చిన్నారిని అతి కిరాతకంగా హత్యాచారం చేసిన ఘటన.. రాష్ట్రాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఇంట్లో అద్దెకు ఉన్న బాలికపై ఆ ఇంటి యజమాని కుమారుడు.. ప్రేమ పేరుతో లైంగికంగా వేధించి.. ఆత్మహత్యకు చేసుకొనేలా చేసిన ఘటన జగద్గిరిగుట్టలో జరిగింది. ఇలా రోజూ నగరంలోని ఏదో ఓ చోట.. అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి  సేఫెస్ట్​ సిటీ అని చెప్పుకునే హైదరాబాద్​ నగరంలోనే వరుస అత్యాచారాలు జరగటం.. నగరవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఇలాంటి క్రూరమైన ఘటనలు కేవలం హైదరాబాద్​కే పరిమితం కాకుండా.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన ఓ కీచక తండ్రి.. సొంత కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిత్యం మద్యం మత్తులో ఉండి.. కామంతో కళ్లు మూసుకుపోయి అసభ్యకరం(Father sexualyl harassed daughter)గా ప్రవర్తించి.. తండ్రికూతుళ్ల బంధాన్నే అవమానించాడు. మూడేళ్లుగా ఈ దుశ్చర్య(Father sexualyl harassed daughter)కు పాల్పడుతుంటే ఎవరికి చెప్పాలో అర్థంగాక ఆ కూతురు పడిన నరకయాతన సభ్యసమాజాన్ని కలచివేశింది. జోగులాంబ గద్వాల జిల్లాలో 80 ఏళ్ల వృద్ధురాలితో పాటు ఆమె మనవరాలిపైన ఓ 16 ఏళ్ల మైనర్​ కీచకుడు అత్యాచారం చేశాడు. అదే జిల్లాలో మరో బాలుడు ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించాడు.

ఇవి కేవలం మచ్చుకు మాత్రమే. లోకానికి తెలిసినవి మాత్రమే. ఫిర్యాదులు చేసినవి మాత్రమే. ఇంకా.. వెలుగుచూడని ఘటనలు ఎన్ని ఉన్నాయో..? చెప్తే చంపేస్తామన్న బెదిరింపులకు భయపడి.. నరకయాతన పడుతున్న పడతులెందరో. కరోనా వైరస్​ను ఎదుర్కొనే వ్యాక్సిన్​లు వచ్చినట్టు.. ఇలాంటి కామాంధుల మెదళ్లో కీచక ఆలోచనలను చంపేసే మందు కోసం ఎదురుచూస్తూ.. ఏడ్చే అతివలెందరో..!

ఇదీ చదవండి:

Last Updated : Oct 6, 2021, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.