ETV Bharat / crime

'ఎమ్మెల్యేలకు ఎర కేసు'.. చంచల్​గూడ జైలుకు నిందితులు - నిందితులకు 14 రోజుల రిమాండ్

Buying TRS MLAs Issue Case Update: సంచలనం సృష్టించిన తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ ప్రత్యేక కేసుల న్యాయస్థానం 14 రోజులు రిమాండ్‌ విధించింది. పోలీసులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. 48 గంటల తేడాలో పోలీసులు రెండుసార్లు నిందితులను అరెస్టు చేశారు. హైకోర్టులో దాఖలైన వేర్వేరు పిటిషన్లపై న్యాయమూర్తులు... ఒక వైపు రిమాండ్‌, మరో వైపు దర్యాప్తు నిలిపివేయాలంటూ భిన్నమైన తీర్పులు వెలువరించారు. తదుపరి విచారణ కోసం నిందితులను కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిని ఏసీబీ కోర్టు తిరస్కరించింది.

Buying TRS MLAs Issue
Buying TRS MLAs Issue
author img

By

Published : Oct 30, 2022, 7:15 AM IST

Updated : Oct 30, 2022, 7:30 AM IST

Buying TRS MLAs Issue Case Update: తెరాస శాసన సభ్యులను ప్రలోభాలకు గురిచేశారనే కేసులో నిందితులను పోలీసులు జైలుకు తరలించారు. ఈ వ్యవహారంపై ఈ నెల 26న మొయినాబాద్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా... 41-ఏ సీఆర్​పీసీ నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం తగదంటూ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోవాలని, లేదా వారిని అరెస్టుచేసి రిమాండ్‌కు పంపాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు.

మరోవైపు ఇదే కేసులో రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని ప్రత్యేక దర్యాప్తు బృందం లేదా సీబీఐకి అప్పగించాలని భాజపా దాఖలు చేసిన పిటిషన్‌పై మరో న్యాయమూర్తి విచారణ జరిపారు. దర్యాప్తును వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టు ఆదేశాలతో నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌ను పోలీసులు నిన్న రెండోసారి అరెస్ట్ చేశారు. అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరచగా... నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. 41-ఏ సీఆర్​పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం తగదంటూ ఏసీబీ కోర్టు రిమాండ్‌ను తిరస్కరించిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించి పోలీసులు అనుమతి పొందారు. ఈ క్రమంలో నిందితులు ఫిల్మ్ నగర్ షేక్‌పేట రహదారిలో ఉన్న నందకుమార్‌ నివాసమైన ఆదిత్య హిల్‌ టాప్‌లో ఉన్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు.

అక్కడకు వెళ్లిన బంజారాహిల్స్ పోలీసులు, సైబరాబాద్ ఎస్​ఓటీ పోలీసులు వెళ్లగా... గమనించిన నందకుమార్ లిఫ్టును నిలిపివేశాడు. దీంతో సెల్లార్‌కు చేరుకున్న పోలీసులు. ఎనిమిదో అంతస్తుకు మెట్లపై నుంచి నడుచుకుంటూ వెళ్లారు. ఫ్లాట్ నంబరు 603లో నంద కుమార్‌తో పాటు సింహయాజి, రామచంద్ర భారతిని అదుపులోకి తీసుకొన్నారు. అక్కడి నుంచి సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో 15 నిమిషాలు విచారించారు. అనంతరం మోయినాబాద్ ఠాణాకు తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం చేవెళ్ల ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. తిరిగి ఠాణాకు వచ్చి అక్కడి నుంచి ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు.

ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకూ పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. ముగ్గురు నిందితులు ఒకరినొకరు ఎలా కలిశారు? వారికి ఉన్న పాతపరిచయాలు తదితర వివరాలను సేకరించారు. రాజకీయ నాయకులు , ప్రజాప్రతినిధులు , వ్యాపారవేత్తలతో వీరికి ఉన్న అనుబంధంపై ఆరా తీశారు. నందకుమార్ కు పలువురు నాయకులతో పరిచయాలున్నట్టు గుర్తించారు. ఇతడికి సింహయాజితో ఎంతకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయనేది తేల్చే ప్రయత్నం చేశారు. ఇటీవల తనను కలిసి ఓ స్వామీజీ కొద్దిరోజుల్లో తాను చాలా కీర్తి సంపాదిస్తా అని అన్నట్లు.. అయితే ఇలా అపకీర్తి పాలవుతానని ఊహించలేకపోయా అని నందకుమార్ పోలీసుల ముందు వాపోయినట్లు సమాచారం.

మరోవైపు... నిందితులు ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తులు కావడంతోపాటు అనారోగ్య సమస్యలు ఉన్నాయని... జైలులో ఏ క్లాస్ సదుపాయాలు కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. నిందితులను కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయమూర్తిని కోరగా... అందుకు అంగీకరించలేదు. నాలుగో తేదీ తర్వాతే ఆ విషయంపై ఆలోచిస్తామని స్పష్టం చేసింది. ముగ్గురు నిందితులు వచ్చే నెల 11 వరకు రిమాండ్‌లో ఉండనున్నారు.

'ఎమ్మెల్యేలకు ఎర కేసు'.. చంచల్​గూడ జైలుకు నిందితులు

ఇవీ చదవండి:

Last Updated : Oct 30, 2022, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.