ETV Bharat / crime

Monitor lizard: ఉడుమును వేటాడారు.. జైలుకెళ్లారు.. - Monitor lizard news

ఉడుము(Monitor lizard)ను వేటాడిన నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించిన ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో జరిగింది. గత మంగళవారం నిందితులు ఉడుమును వేటాడారు.

ఉడుమును వేటాడినందకు 14 రోజుల రిమాండ్​
ఉడుమును వేటాడినందకు 14 రోజుల రిమాండ్​
author img

By

Published : Jun 10, 2021, 2:12 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల అటవీ ప్రాంతంలో ఉడుము(Monitor lizard)ను వేటాడిన ఘటనలో ముగ్గురు నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వటవర్లపల్లి గ్రామానికి చెందిన చారకొండ గోపాల్, మన్ననూర్​కు చెందిన నేనావత్ గోపాల్, ఆలేటి శివ మంగళవారం మధ్యాహ్నం అభయారణ్యంలో వన్యప్రాణి అయిన ఉడుమును వేటాడి చంపారు. ఉడుమును ఆటోలో ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై మన్ననూర్ దుర్వాసుల చెక్ పోస్టు వద్ద అటవీ అధికారులకు పట్టుబడ్డారు.

నిందితులను అరెస్టు చేసి బుధవారం కల్వకుర్తి కోర్టులో హాజరుపరచగా కోర్టు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. వేట కోసం వినియోగించిన రెండు ఆటోలను సీజ్ చేశారు. ఎవరైనా వన్యప్రాణులకు హాని తలపెడితే చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఇదీ చదవండి: Sonu Sood: 'దేశవ్యాప్తంగా 18 ఆక్సిజన్ ప్లాంట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.