Today Road Accident: మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి శివారులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. గేదెను తప్పించే ప్రయత్నంలో రోడ్డు కిందకు దూసుకుపోయింది. ఘటనలో బస్సు నుజ్జునుజ్జయింది. 13 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఘటన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణిస్తున్నారు.
కామారెడ్డి డిపోకు చెందిన ఈ బస్సు.. భద్రాచలం వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా గేదెను రక్షించడం కోసం బస్సును తప్పించగా.. ప్రమాదంలో అది మృతి చెందింది. బస్సు వేగంగా రోడ్డు కిందకు దూసుకెళ్లి.. ఓ చెట్టును ఢీ కొట్టి ఆగిపోయిందని ప్రయాణికులు పేర్కొన్నారు. లేదంటే ప్రమాద తీవ్రత మరింత పెరిగేదని భయాందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: రైలెక్కి సెల్ఫీ తీసుకుంటుండగా.. బాలుడికి విద్యుత్ షాక్