ETV Bharat / crime

fake mirchi seeds:రూ.13 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం - మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి

మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లి శివారులో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.13 లక్షల విలువ చేసే 3,238 ప్యాకెట్ల నకిలీ మిరప విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.

mahabubabad sp koti reddy
fake mirchi seeds: 13 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం
author img

By

Published : Jun 7, 2021, 11:05 PM IST

మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లి శివారులో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.13 లక్షల విలువ చేసే 3,238 ప్యాకెట్ల నకిలీ మిరప విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పేర్కొన్నారు.

మహబూబాబాద్ గ్రామీణ పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది మహబూబాబాద్ మండలం ఈదులపూసపల్లిలో వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన కారులో సోదా చేయగా.. కారులో ముగ్గురు వ్యక్తులతోపాటు… దీప్తి-1600, భూమిక-1000, పలనాడు-25, సిరి-10, రాజేశ్వరి-300, పద్మావతి-271, అల్ట్రా వెరైటీ-32 ప్యాకెట్ల మిరప విత్తనాలు లభించాయి.

ఆ ప్యాకెట్లను ఆంధ్రప్రదేశ్​ నుంచి అక్రమంగా రాష్ట్రంలోని ఈదులపూసపల్లికి తరలిస్తున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పి.డి యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఈ నకిలీ విత్తనాలు పట్టుకునేందుకు కృషి చేసిన వ్యవసాయశాఖ అధికారి తిరుపతిరెడ్డి, రూరల్ సి.ఐ.రవికుమార్, ఎస్.ఐ రమేశ్ బాబులను ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ యోగేశ్ గౌతమ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్​లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నీట మునిగి ముగ్గురు చిన్నారులు సహా నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.