ETV Bharat / crime

హోలీ సంబురాల్లో విషాదం.. చెరువులు, కుంటల్లో స్నానాలకు వెళ్లి 12 మంది మృతి

author img

By

Published : Mar 19, 2022, 7:04 AM IST

అప్పటివరకు ఎంతో ఆనందంగా రంగులాట ఆడిన కొందరి జీవితాల్లో ఆ రంగులు ఎక్కువసేపు ఉండలేదు. శరీరాన్ని కప్పేసిన రంగులను కడిగేసుకుందామని వెళ్లిన వారిని మృత్యువు కమ్మేసింది. జీవితం రంగులమయం కావాలన్న వారి కల.. చెరువుల్లో, కుంటల్లో మునిగి.. వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో హోలీ రోజు 12 మంది మృతి చెందిన విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి.

12 youngsters died in holi celebrations telangana wide

హోలీ పండగ అంటే చాలు రంగుల జల్లులు.. యువత కేరింతలు.. రెండేళ్లుగా కొవిడ్‌ కారణంగా ఆంక్షల వల్ల హోలీ సంబురాలు జరుపుకోలేని పరిస్థితి.. ఇటీవలే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఈసారి అంబరాన్నంటాయి. నగరాలు, పట్టణాలే కాకుండా గ్రామాల్లో కూడా యువత రంగుల్లో మునిగి తేలారు. ఒంటిని ముంచెత్తిన రంగులకు తోడు ఎండలు మండిపోతుండడంతో యువకులు దగ్గరలోని నదులు, చెరువులు లేదా కుంటలు, కాలువల్లోకి స్నానానికి వెళ్లడం పరిపాటి. ఇదే క్రమంలో శుక్రవారం పన్నెండు మంది నీట మునిగి చనిపోగా మరో నలుగురు గల్లంతయ్యారు. దీంతో వారి కుటుంబాల్లో తీరని వేదన మిగిలింది. చాలాచోట్ల చెరువుల్లో మట్టి తవ్వకాల సందర్భంగా గోతులు తవ్వడంతో లోతు అంచనా వేయలేక కొదరు మునిగిపోగా మరికొందరు ఈత రాక నీటిలో మృత్యువాతపడ్డారు.

  • పెద్దపల్లి జిల్లా బోయినిపేట గ్రామానికి చెందిన ఎర్రవేన ముఖేష్‌ (14) హోలీ అనంతరం మిత్రులతో కలిసి స్నానం చేయడానికి బొక్కలవాగుకు వెళ్లాడు. వాగులో తీసిన గుంతల్లో నీళ్లు ఎక్కువగా ఉండటంతో ఈత రాక మునిగిపోయాడు. కొన ఊపిరితో ఉన్న ముఖేష్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బొక్కలవాగులో మట్టి తవ్వకానికి గోతులు తీయడం వల్లే ముఖేష్‌ మృతి చెందాడని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.
  • మెదక్‌ జిల్లా మక్తలక్ష్మాపురం గ్రామానికి చెందిన రామాయి సతీష్‌ (27) భార్య మాధవితో కలిసి హైదరాబాద్‌ మియాపూర్‌లో పని చేస్తున్నాడు. హోలీ పండగకు భార్యాభర్తలిద్దరూ స్వగ్రామానికి వచ్చాడు. మిత్రులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న అనంతరం స్నానం చేద్దామని చెరువుకు వెళ్లారు. సతీష్‌ నీటిలో మునిగిపోవడంతో అతడి మిత్రులు బయటకు తీసుకొచ్చారు. వెంటనే పెద్దశంకరంపేట ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సులానగర్‌ గ్రామానికి చెందిన గుగులోత్‌ స్వామి(22) ఇంటర్‌ వొకేషనల్‌ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి హోలీ అనంతరం గొల్లపల్లి ఎత్తిపోతల సమీపంలోని నల్లవాగులో ఈతకు వెళ్లాడు. లోతు అంచనా వేయలేకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు.
  • కర్ణాటక రాయ్‌చూర్‌కు చెందిన రాజు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా యంనంపేటలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. ఆయన ఏకైక కొడుకు వి.నరేంద్ర(15) స్నేహితులతో కలిసి సమీపంలోని కుంటలోకి స్నానానికి దిగాడు. లోతు అంచనా వేయకపోవడం, ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. అక్కడే ఉన్న కొందరు యువకులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు.
  • గుజరాత్‌కు చెందిన దినేష్‌కుమార్‌(21) కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌కు వలస వచ్చి ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. హోలీ సంబరాల్లో భాగంగా మిత్రులతో కలిసి కుమురం భీం ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. స్నానం చేసేందుకు దిగుతూ కాలు జారి నీటిలో మునిగిపోయాడు. స్థానికులు గమనించి బయటికి తీసి ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
  • మహబూబాబాద్‌ జిల్లా మడిపల్లి. గ్రామానికి చెందిన పేర్ల రామారావు-వెంకటలక్ష్మి దంపతులు ముంబయిలో ఉంటారు. ఇంట్లో ఒంటరిగా ఉండే వీరి కుమారుడు సాగర్‌ (19) స్నేహితులతో కలిసి హోలీ ఆడాక స్నానం చేయడానికి చెరువు వద్దకు వెళ్లి, అందులో పడి మృతి చెందాడు. అతడి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో పోలీసులు వారికి సమాచారం అందించడానికి ప్రయత్నిస్తున్నారు.
సుధాకర్​
  • నిజామాబాద్‌ జిల్లా పెంటాకలాన్‌ గ్రామానికి చెందిన సుధాకర్‌(22) స్నేహితులతో కలిసి హోలీ అనంతరం నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో కాసేపు జలకాలాడారు. తిరుగు ప్రయాణమైన తోటి స్నేహితులు చూడగా సుధాకర్‌ కనిపించలేదు. వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించారు. వారు పోలీసులు, నీటి పారుదల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రవాహన్ని తగ్గించి గజ ఈతగాళ్లతో గాలించగా శవం లభ్యమైంది.
  • నిజామాబాద్‌ జిల్లా నవీపేట జలాల్‌పూర్‌కు చెందిన గూండ్ల రాజేశ్వర్‌(50) స్నేహితులతో కలిసి స్థానిక చెరువులో స్నానానికి దిగి మునిగి చనిపోయారు.
  • హనుమకొండ జిల్లా పంథిని గ్రామానికి చెందిన తరాల అజయ్‌కుమార్‌ (14) మిత్రులతో కలిసి గోలెంకుంట చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. మిత్రులు బాలుడి తండ్రి లింగయ్యకు సమాచారం అందించారు. ఆయన వచ్చేసరికి మృతి చెందడంతో గుండెలవిసేలా రోదించాడు.
  • కొత్తగూడెం పట్టణం రుద్రంపూర్‌ ఎస్సార్టీ క్వార్టర్స్‌కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి బొజ్జం అఖిల్‌ (14) తెల్లవాగులో ఈతకు వెళ్లాడు. ఒక్కసారిగా 15 అడుగుల లోతుకు వెళ్లిన అతడు గల్లంతయ్యాడు. స్నేహితులెవరికీ ఈత రాకపోవడంతో కాపాడలేకపోయారు. పోలీసులు గాలింపు చేపట్టి రాత్రి 7 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని వెలికితీశారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో కార్మిక దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు.
  • తెల్లవారితే పుట్టినరోజు.. అప్పటివరకు స్నేహితులతో కలిసి హోలీ సంబరాలు చేసుకున్నాడు.. సరదాగా గోదావరిలో ఈతకు వెళ్లి మృత్యుఒడికి చేరాడు. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరుకు చెందిన రావుల వెంకటేశ్వర్లు-కాంతమ్మల చిన్న కొడుకు కార్తీక్‌(23) గీత కార్మికుడు. స్నేహితులతో కలిసి గోదావరికి స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. స్నేహితులు ఎంతవెతికినా దొరకలేదు. కుటుంబసభ్యులు నాటు పడవలతో గాలింపు చేపట్టగా సాయంత్రం మృతదేహం లభ్యమైంది.
  • నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం సీతారాంపురానికి చెందిన మేడబోయిన భాస్కర్‌(38) మున్సిపాలిటీలో ఒప్పంద ఉద్యోగి. శుక్రవారం హోలీ పండగకు తోడు తన పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి విందు చేసుకున్నారు. సాయంత్రం ముల్కలకాల్వలో ఈతకు దిగారు. స్నేహితులు నలుగురు ఈత కొడుతుండగా.. భాస్కర్‌ ఒడ్డున కల్వర్టు మీద కుర్చున్నారు. అక్కడి నుంచి ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోయారు. లోతు తక్కువ ఉండడంతో బలమైన గాయాలతో భాస్కర్‌ పైకి లేవలేకపోయారు. స్నేహితులు పరుగున వెళ్లి వెలికితీయగా అప్పటికే మృతిచెందారు.

మరో నలుగురి గల్లంతు...

గల్లంతైన వారి ఫైల్​ ఫొటోలు..
  • ల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చేపూరుకు చెందిన మారుపాక మహేష్‌(23) అక్కంపల్లి జలాశయం దిగువన ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలో స్నేహితులతో కలిసి ఈత కొడుతుండగా గల్లంతయ్యాడు. నీటి ఉద్ధృతి కారణంగా చూస్తుండగానే కొట్టుకుపోయాడని, ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదని స్నేహితులు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూనవరం గ్రామానికి చెందిన బత్తుల రాంబాబు (32) స్నేహితులతో కలిసి కూనవరం సమీపంలోని రేగులగండి చెరువులో ఈతకు వెళ్లాడు. లోతైన ప్రదేశానికి వెళ్లటంతో రాంబాబు గల్లంతయ్యాడు. అతని కోసం సహచరులు గాలించినా జాడలేదు. అలాగే నిర్మల్‌ పట్టణానికి చెందిన రాంపెల్లి సాయిరాం(26) మిత్రులతో కలిసి గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లి నీటిలో గల్లంతయ్యాడు. మిత్రులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఇదే పట్టణానికి చెందిన మిత్రులు సాయికిరణ్‌, సాయితేజ, దీపక్‌, ఆకాశ్‌ శుక్రవారం సాయంత్రం స్థానిక సిద్ధాపూర్‌ వాగు సమీపంలోని సరస్వతి కాలువలో స్నానం చేసేందుకు వెళ్లారు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సాయితేజ(19) కొట్టుకుపోయాడు. వీరందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఏపీలో నలుగురు చిన్నారుల మృతి..

ఏపీలో శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో హోలీ స్నానాలకు వెళ్లి నలుగురు మృతి చెందారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం అయ్యప్పగానిపల్లికి చెందిన అశోక్‌(12), సరిత(16) మరికొందరు స్నేహితులతో కలిసి రంగులు చల్లుకున్నారు. అనంతరం చెరువులో దిగి రంగులు కడుక్కుంటుండగా అశోక్‌ కాలు జారి చెరువులో పడ్డాడు. సరితకు ఈత వచ్చినా అశోక్‌ను కాపాడబోయి తనూ నీటిలో మునిగి మృతి చెందింది. బాపట్ల మండలం బేతపూడికి చెందిన కోట తేజ శ్రీనివాసరెడ్డి(19) అయిదుగురు మిత్రులతో కలిసి చీరాల మండలం వాడరేవు సముద్రంలో స్నానం చేస్తూ అలల తాకిడికి గల్లంతై మృతిచెందాడు. రాజమహేంద్రవరానికి చెందిన శ్యామ్‌ప్రసాద్‌(16) గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. తల్లిదండ్రులు గాలించడంతో మృతదేహం లభ్యమైంది.

ఇదీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.