ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో 12 ఇళ్లు దగ్ధమయ్యాయి. మరో అగ్ని ప్రమాదంలో మూడు కోళ్ల షెడ్లు కాలిపోయిన ఘటనలో రూ.15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటన పండగపూట నెలకొనడంతో ఆయా కుటుంబాలు తాము వీధిన పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం రేగలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. లక్కవరపుకోట మండలంలోని రేగ గ్రామంలో అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం 12 పూరి గుడిసెలు కాలి బూడిదయ్యాయి. ఇళ్లల్లో ఉన్న వస్తువులతో పాటుగా.. దుస్తులు, నిత్యవసర సరుకులు, నగదు కాలిబూడిదయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. పండగ ముందు ప్రమాదం జరగడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. లక్కవరపుకోట తహశీల్దార్ రామకృష్ణ ఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. బాధితులతో మాట్లాడారు, సూమారు రూ.30 లక్షల వరకు నష్టం జరిగినట్లు తెలుస్తుంది. ఆస్తి నష్టం అంచనా వేయాల్సి ఉందని అధికారు తెలిపారు.
కోళ్ల షెడ్డులో అగ్ని ప్రమాదం: పూసపాటిరేగ మండలంలోని చిన్న పతివాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు కోళ్ల షెడ్లు కాలిపోయాయి. సుమారు 4వేల కోడి పిల్లలు అగ్నికి అహుతి అయ్యాయి. సుమారుగా 15లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలి షెడ్డు యజమాని కోరుతున్నాడు.
ఇవీ చదవండి: