ETV Bharat / crime

THEFT: గంటలో 80 వేల రూపాయలు, 2 వెండి విగ్రహాల చోరీ - తెలంగాణ 2021 వార్తలు

హైదరాబాద్​లోని జగద్గిరిగుట్ట పరిధిలో... గంట వ్యవధిలోనే రెండు దొంగతనాలు జరిగాయి. తాళం వేసి ఉన్న ఇంట్లో 80 వేల రూపాయల నగదు దోచేయగా... ఆలయంలో కిలో విలువ చేసే వినాయకుడి, ఆంజనేయ స్వామి వెండి విగ్రహాలను చోరీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

1-kg-silver-and-80-thousand-rupees-cash-looted-in-just-one-hour-at-hyderabad
గంటలో 80 వేల రాపాయలు, 2 వెండి విగ్రహాలు స్వాహా..
author img

By

Published : Jul 26, 2021, 12:42 PM IST

హైదరాబాద్ జగద్గిరిగుట్ట పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకొని అంబేడ్కర్ నగర్​లో అర్ధరాత్రి చోరీ చేశారు. ఇంటి కిటికీలు విరగొట్టి లోనికి చొరబడ్డ దుండగులు... 80 వేల రూపాయలను దోచుకెళ్లారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ ఇంటికి చేరుకున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా తమ సొంతూరికి వెళ్లామని... తిరిగొచ్చేలోపే ఇంట్లో దొంగలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులకు ఫిర్యాదు...

ఎన్నో రోజులుగా కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఆగంతకులు ఎత్తుకెళ్లడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడడం రికార్డయిందని... త్వరలోనే దుండగులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

వినాయకుడి గుడిలోనూ దొంగతనం...

అలాగే శ్రీరామ్ నగర్​లోని వినాయకుడి గుడిలోనూ చోరీ జరిగినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు... అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఇద్దరు చోరులు... ఆంజనేయుడి, దుర్గామాత వెండి విగ్రహాలను ఎత్తుకెళ్లడం రికార్డయింది. రెండు విగ్రహాలు కలిసి దాదాపు కిలో వరకూ బరువుంటాయని ఆలయ అర్చకులు తెలిపారు. గంట వ్యవధిలోనే రెండు చోరీలు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వివరించారు.

ఇదీ చూడండి: POCSO: బాధితులను రక్షించేందుకు... పోలీసుల కొత్తపంథా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.