ETV Bharat / city

ఎంబీబీఎస్‌ సీట్లు సాధించినా... కలచివేస్తున్న ఆర్థిక కష్టాలు - neet rankers

Financial problems: నిరుపేద కుటుంబమైనా.. తమ పిల్లలిద్దరూ వైద్యులు కావాలని ఆ తండ్రి కలలు కన్నారు. అందుకు తమ రక్తాన్ని ధారపోసి అయినా చదివించాలని తపన పడ్డారు. కరోనా తండ్రిని బలి తీసుకున్నా.. తండ్రి కల కోసం ఆ పిల్లలు అధైర్యపడకుండా కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. కానీ ఫీజులు కట్టేందుకు డబ్బులు లేక ప్రస్తుతం వారు ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా ఆదుకుంటే తమకు మంచి భవిష్యత్తు ఇచ్చినవారవుతారని ఆ విద్యార్థులు, వారి తల్లి వేడుకుంటున్నారు.

MBBS STUDENTS
MBBS STUDENTS
author img

By

Published : Apr 4, 2022, 9:52 AM IST

Updated : Apr 4, 2022, 1:08 PM IST

తల్లితో కలిసి దాతల సాయం కోసం విద్యార్థుల అభ్యర్థన

Financial problems: 'ఇళ్లే గడవని పరిస్థితుల్లో మిమ్మల్ని ఎట్టా సదివించేదమ్మా...! పోయినేడాది తక్కువ మార్కులు వచ్చినా మొక్కవోని పట్టుదలతో ఈసారి మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు. అప్పుడు నాన్న ఏదో ఒక కష్టం చేసి చదివించాడు. ఇప్పుడు ఇంత పెద్ద సదువాయో....ఏం సేసేది..! ఆ భగవంతుడి దయ... ఏ మహాప్రభో వచ్చి మీకు దారి సూపితే బావుండు...!' నీట్‌ పరీక్షలో మంచి ర్యాంకులు సాధించినా... కటిక పేదరికంతో ముందడుగు వేయలేకపోతున్నారు. చదువంటే వారికి ప్రాణం. దాతల సహాయం కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. వరంగల్ పట్టణానికి చెందిన ఇద్దరు సరస్వతి పుత్రుల దుస్థితి ఇది.

గత సంవత్సరం తండ్రి కరోనాతో చనిపోయినా అధైర్యపడకుండా పిల్లలు షేక్‌ సోయబ్‌, సానియాలు కష్టపడి చదవి ఎంబీబీఎస్‌ సీట్లు సాధించారు. అయితే ఫీజులు కట్టేందుకు డబ్బులు లేక ప్రస్తుతం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తల్లితో కలిసి దాతల సాయం కోసం అభ్యర్థిస్తున్నారు. సానియాకు కాకతీయ మెడికల్‌ కళాశాలలో సీటు రాగా, షేక్‌ షోయబ్‌కు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలలో కన్వీనర్‌ కోటాలో సీటు వచ్చింది. తన పిల్లలను ఆదుకోవాలని చేతులెత్తి వేడుకుంటోంది తల్లి జహీరా బేగం.

వీరి తండ్రి షేక్‌ షబ్బీర్‌ ములుగు జిల్లా కేంద్రంలో కంప్యూటర్‌ టైపింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నడిపేవారు. గతేడాది ఆయన కరోనాతో చనిపోగా.. సొంతిల్లు సైతం లేకపోవడంతో హనుమకొండ నగర పరిధిలో గోపాల్‌పూర్‌లోని తన పుట్టింట్లో తాత్కాలికంగా ఉంటున్నట్లు జహీరా బేగం తెలిపారు.

తండ్రి చనిపోయినా మనోధైర్యంతో.. ‘మమ్మల్ని వైద్యులను చేయాలని నాన్న తపన పడేవారు. తన గురించి ఎప్పుడు ఆలోచించకుండా మాకోసమే ఎప్పుడూ కష్టపడేవారు. తొలిసారి నీట్‌లో మంచి ర్యాంక్‌ రాకపోవడంతో గత ఏడాది మెరుగైన శిక్షణకు హైదరాబాద్‌ పంపారు. గత జూన్‌లో మా నాన్న కరోనా బారిన పడ్డారు. ఈ విషయం తెలిస్తే మా ఏకాగ్రత దెబ్బతింటుందని ఆ విషయాన్ని తెలియనీయలేదు. కొద్దిరోజులకే మహమ్మారి ఆయన్ను కబళించింది. ఈ విషయం తెలిసి తీవ్ర ఒత్తిడికి గురయ్యాం. మమ్మల్ని డాక్టర్లుగా చూడాలన్న నాన్న ఆశయం గుర్తొచ్చి.. మనోధైర్యం కూడగట్టుకుని చదివి మంచి ర్యాంకులు తెచ్చుకున్నాం. మాకు ఉండటానికి ఇళ్లు లేదు. అద్దె ఇంట్లో ఉంటూనే చదువుకున్నాం. ఎవరైనా ముందుకొచ్చి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాము.’

-సానియా, షోయబ్‌, విద్యార్థులు

భావి వైద్యులుగా రాణించే అవకాశం ఉన్నా ఆర్థిక స్తోమత లేక చదువు ముందుకు సాగకపోవడం దుర్భరమైన పరిస్థితి. ఇందులో నుంచి ఆ విద్యార్థులు గట్టెక్కాలంటే.. దాతలు ముందుకు రావాలి. ప్రభుత్వం కదలి ఆపన్నహస్తం అందించాలి. ఏవరైనా స్పందించి తమ చదువులకు సహకరిస్తే వైద్యులుగా రాణిస్తామని విన్నవించారు.

ఇదీ చదవండి : New Courses in Degree : 'డిగ్రీలో కొత్త కోర్సులు.. ఆసక్తి చూపుతున్న విద్యార్థులు'

Last Updated : Apr 4, 2022, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.