ఇంటర్ బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ వరంగల్‌లో కాంగ్రెస్ ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి, మాజీ మంత్రి కొండా సురేఖ హన్మకొండలోని ఏకశిలాపార్క్ వద్ద ధర్నా చేపట్టారు. కలెక్టరేట్‌కు వెళ్లడానికి యత్నించిన విజయశాంతి, ఇతర నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు రాములమ్మను అరెస్ట్ చేసి హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని విజయశాంతి మండిపడ్డారు.
వరంగల్‌లో రాములమ్మ అరెస్ట్
ఇంటర్ బోర్డు వైఫల్యం, ప్రభుత్వ తీరును నిరసిస్తూ వరంగల్‌లో ధర్నాకు దిగిన టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ వచ్చిన కూడా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధకరమని రాములమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.