TRS on Rahul's Telangana Tour : నేడు వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న రాహుల్ సభపై తెరాస నాయకులు.. విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు సంధించారు. రాహుల్‌గాంధీ పర్యటనపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్టర్ వేదికగా.. పలు ప్రశ్నలు సంధించారు. పార్లమెంట్‌లో తెలంగాణ అంశాలు కాంగ్రెస్ ఎన్నిసార్లు ప్రస్తావించిందో చెప్పాలన్నారు. రాష్ట్ర హక్కుల కోసం తెరాస పోరాడుతున్నప్పుడు రాహుల్ ఎక్కడున్నారని నిలదీశారు. దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై పోరాడుతున్నప్పుడు రాహుల్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు జాతీయ హోదాపై తెరాస పోరాటం చేస్తుంటే రాహుల్ ఎక్కడున్నారని అడిగారు. కేసీఆర్ రైతుబంధు, రైతు బీమాపై తమ పార్టీ నేతలను అడగాలని సూచించారు. తెలంగాణ ముఖచిత్రం ఎలా మార్చామో కూడా అడిగి రాహుల్ తెలుసుకోవాలని ట్విట్టర్లో తెలిపారు.
-
As Shri @RahulGandhi Ji arrives in Telangana today, I sincerely request him to introspect on the following. How many times have you raised the issues of #Telangana in parliament ? 1/4 pic.twitter.com/f9aOYz69jE
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">As Shri @RahulGandhi Ji arrives in Telangana today, I sincerely request him to introspect on the following. How many times have you raised the issues of #Telangana in parliament ? 1/4 pic.twitter.com/f9aOYz69jE
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 6, 2022As Shri @RahulGandhi Ji arrives in Telangana today, I sincerely request him to introspect on the following. How many times have you raised the issues of #Telangana in parliament ? 1/4 pic.twitter.com/f9aOYz69jE
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 6, 2022
కాంగ్రెస్ సభపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూనే.. రాహుల్ గాంధీకి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాలన ఫలితమే వ్యవసాయరంగ దయనీయస్థితికి కారణమని లేఖలో పేర్కొన్నారు. యూపీఏ పదేండ్ల పాలనలో ఎక్కడ చూసినా.. రైతుల మరణమృదంగ విషాదమేనని.. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారమే లక్షా 58 వేల 117 మంది రైతులు అప్పుల పాలై.. ఆత్మహత్యలు చేసుకున్న విషయం వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. సమస్యలపై పోరాటం చేసిన రైతులపై నాడు తుపాకి తూటాలు పేల్చి.. ఈరోజు రైతు సభలు పెడ్తరా..? అని నిలదీశారు.
"వరిధాన్యం కొనుగోలుపై మోదీ సర్కారు మోసానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతులు ఆందోళనకు దిగినప్పుడు.. ఎందుకు మద్దతు ఇవ్వలేదు..? వ్యవసాయరంగానికి సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, మౌలిక వసతుల కల్పన కోసం.. ఈ ఎనిమిదేళ్లలో 3 లక్షల 80వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత మా ప్రభుత్వానిది. ఈ దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ వ్యవసాయ విధానాలు.. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయండి." - నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
వరంగల్‌లో జరిగేది రైతుసంఘర్షణ సభ కాదని.. అది రాహుల్ సంఘర్షణ సభ.. కాంగ్రెస్ సంఘర్షణ సభ అని రైతు బంధు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఇచ్చే స్క్రిప్ట్ చదివే ముందు.. ఇక్కడ వ్యవసాయానికి తెరాస ప్రభుత్వం చేసిన పనుల గురించి తెలుసుకోవాలని రాహుల్ గాంధీకి సూచించారు. తెలంగాణ వ్యవసాయ రంగం.. దేశంలోనే మొదటి స్థానంలో ఉందని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు ఉండేవని.. ప్రస్తుతం ఈ పరిస్థితిని మార్చిన ఘనత తమదేనని పల్లా పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలు అవుతున్న పథకాలను అమలు చేసిన తర్వాత మాట్లాడాలని రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
ఇదీ చూడండి: