ETV Bharat / city

corporator house demolished: తెరాస కార్పొరేటర్​ ఇంటిని కూల్చేసిన అధికారులు.. ఎందుకంటే? - hanamkonda demolition

corporator house demolished: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలపై అధికారులు కొరఢా ఝళిపిస్తున్నారు. నిబంధనలు అనుసరించని వాళ్లు ఎవ్వరైనా సరే.. ఏమాత్రం ఉపేక్షించటం లేదు. హనుమకొండలోని బ్రహ్మణవాడలో.. ఏకంగా అధికార పార్టీ కార్పొరేటర్​ ఇంటినే అధికారులు కూల్చేశారు.

trs corporator house demolished in hanamkonda

author img

By

Published : Dec 14, 2021, 4:17 PM IST

తెరాస కార్పొరేటర్​ ఇంటిని కూల్చేసిన అధికారులు..

corporator house demolished: హనుమకొండలోని ఏడో డివిజన్ తెరాస కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ ఇంటిని బల్ధియా అధికారులు కూల్చివేశారు. నగరంలోని బ్రహ్మణవాడలో కార్పొరేటర్ శ్రీనివాస్ నింబంధనలకు విరుద్ధంగా ఇంటిని నిర్మించారంటూ కొంతమంది వ్యక్తులు వరంగల్‌ బల్ధియా అధికారులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన అధికారులు ఇంటిలోని కొంత భాగాన్ని కూల్చారు.

అధికారులు ఇంటిని కూల్చివేస్తుండగా శ్రీనివాస్ అనచరులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. నింబంధనలకు విరుద్దంగా ఉన్న ఇంటి భాగాన్ని కూల్చేశారు. దీనిపై తెరాస కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు. అధికార తెరాస పార్టీ కార్పొరేటర్ ఇంటినే కూల్చేయటం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయశమైంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.