వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. డీసీ తండాలోని 5వ వార్డులో ట్రాక్టర్లలో చెత్త తరలిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ పొలంలో ఉన్న చెత్తను తొలగించి పాడుబడ్డ బావిలో వేసేందుకు రివర్స్‌లో వెళ్లిన ట్రాక్టర్ సరైన సమయంలో బ్రేక్ పడకపోవడంతో బావిలో పడింది.
ట్రాక్టర్‌తో పాటు అంగోత్ జనార్దన్ అనే వ్యక్తి బావిలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి జనార్దన్‌ను అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.