ETV Bharat / city

అటవీశాఖ తీరుపై ఆందోళన - cm

అడవుల్లో చెట్ల నరికివేత, అక్రమ కలప వ్యాపారంపై అటవీ అధికారుల కఠినచర్యలు విశ్వబ్రాహ్మణులకు శాపంగా మారాయి. పోలీసుల వరుస దాడులతో ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్​తో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు.

ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన
author img

By

Published : Feb 12, 2019, 11:47 PM IST

Updated : Feb 13, 2019, 9:44 AM IST

ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. అక్రమ కలప సరఫరాదారులు, నిల్వ ఉంచుకునే వారిపై అటవీ, పోలీసు శాఖ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. వరుసగా జరుగుతున్న ఈ తనిఖీలతో ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వడ్రంగి పనివారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
undefined

ప్రభుత్వ తీరును నిరసిస్తూ... రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. తమపై ఆటవీశాఖ అధికారులు దాడులు జరుపుతుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తెలంగాణ విశ్వబ్రాహ్మణుల సంఘం మండిపడింది. వరంగల్​ జిల్లా మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న వడ్రంగుల ఇళ్లపై అటవీశాఖ, పోలీసులు దాడులు చేసి కట్టె మిషిన్లను తీసుకెళ్లారని దుయ్యబట్టారు.
ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ.. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ ఎదుట విశ్వ బ్రాహ్మణులు ఆందోళన చేపట్టారు. దాడులను తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు. అసలైన కలప స్మగ్లర్లను వదిలిపెట్టి తమపై దాడులు చేయడం సరికాదన్నారు.
మరోవైపు వడ్రంగి కార్మికులపై వేధింపులకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లాలో సామిల్ యజమానులు బంద్​కు దిగారు, హైదరాబాద్ గ్రేటర్ సిటీ టింబర్స్ మర్చంట్స్, సామిల్లర్స్ అసోసియేషన్ మూడు రోజుల బంద్​కు దిగి బేగంబజార్​లో ధర్నా నిర్వహించారు. జీవో నెం.55 వలన అనేకమంది చేతివృత్తి కళాకారులు జీవనోపాధి కోల్పోయారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో రద్దు చేసి టింబర్ పరిశ్రమను ఆదుకోవాలని కోరారు.

Hyd_Tg_34_12_Timber Merchants Dharana_Av_C1 Contributor: Bhushanam ( ) వడ్రంగి కార్మికులపై ఫారెస్ట్ అధికారుల వేధింపులకు నిరసనగా గ్రేటర్ సిటీ టీంబర్స్ మార్చంట్స్ , సామిల్లర్ల్స్ అసోసియేషన్ ఆందోళన కొనసాగుతుంది. మూడు రోజుల బంద్ లో భాగంగా బేగంబజార్ లో ధర్నా నిర్వహించారు. జీవో నెం 55 వల్ల పోలీసులు, ఫారెస్ట్ అధికారుల వేధింపులు అధికామయ్యాయని వారు అన్నారు. ప్రభుత్వ జీవో నెం55 వల్ల అనేకమంది చేతివృత్తి కళాకారులు జీవనోపాధి కోల్పోయారని... ఈ జీవో రద్దు కోసం గత రెండేళ్లుగా ప్రభుత్వంతో దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో 55ను వెంటనే రద్దు చేసి టీంబర్ పరిశ్రమను ఆదుకోవాలని వారు కోరారు. విజువల్స్.....
Last Updated : Feb 13, 2019, 9:44 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.