ETV Bharat / city

Bhadrakali Bund: సందర్శకులను కట్టిపడేస్తున్న భద్రకాళి బండ్‌ అందాలు

author img

By

Published : Oct 17, 2021, 10:52 PM IST

వరంగల్‌ నగరంలోని భద్రకాళి బండ్‌ అందాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. సెలవు దినాలు, పండుగ రోజుల్లో.. భద్రకాళి బండ్ చూసేందుకు వచ్చినవారితో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో.. ఉల్లాసంగా గడుపుతున్నామని నగరవాసులు చెబుతున్నారు.

Bhadrakali Bund
Bhadrakali Bund
హైదరాహైదరాబాద్ ట్యాంక్​బండ్‌ను మరిపించేలా ఓరుగల్లులోని భద్రకాళి బండ్‌...బాద్ ట్యాంక్​బండ్‌ను మరిపించేలా ఓరుగల్లులో భద్రకాళి బండ్‌...

ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయ సమీపంలో నిర్మించిన భద్రకాళి బండ్ ఇప్పుడు నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇటీవల బండ్ ప్రారంభం కావడంతో... సందర్శకులు పోటెత్తుతున్నారు. సరదా కోసం వచ్చే వారందరికీ అక్కడ పరిసరాలు ఎంతగానో కనువిందు చేస్తున్నాయి. చాలా మంది కుటుంబసమేతంగా వచ్చి ఉల్లాసంగా గడుపుతున్నారు.

హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్​ను మరిపించేలా ఓరుగల్లు మహానగరంలో భద్రకాళి బండ్‌ నిర్మాణం ఇటీవలే పూర్తి చేశారు. హృదయ్‌ పథకం కింద రూ.32 కోట్లతో వరంగల్‌ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ బండ్​ను నిర్మించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన రబ్బరైజ్డ్‌ వాకింగ్‌ ట్రాక్‌ ... అందరినీ ఆకట్టుకుంటోంది. రాత్రి సమయంలో... విద్యుత్ దీపాల కాంతులు బండ్ అందాలను రెట్టింపు చేస్తున్నాయి. పిల్లలు ఆడుకునేందుకు పార్కులు... ఆహ్లాదం కలిగించే చెరువు, చక్కని పూలమొక్కలు ఉండడంతో వచ్చినవారంతా వావ్... అనకుండా ఉండలేకపోతున్నారు. యువత సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడుతున్నారు. కరోనా కారణంగా ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన వారంతా...పిల్లాపాపలతో వచ్చి భద్రకాళి బండ్ అందాలను ఆస్వాదిస్తున్నారు.

పెద్దలకు రూ. 30, పిల్లలకు రూ. 20...

సెలవు దినాల్లో...పండుగ రోజుల్లో బండ్ పరిసర ప్రాంతాలు నగరవాసులతో జాతరను తలపిస్తున్నాయి. పెద్దలకు రూ. 30, చిన్న పిల్లలకు రూ. 20 రుసుము వసూలు చేస్తున్నారు. భద్రకాళి బండ్ రెండో దశ పూర్తైతే... బండ్ నగరానికే మణిహారంగా భాసిల్లుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని నగరవాసులు అంటున్నారు.

భద్రకాళి బండ్‌పై లైటింగ్స్ చాలా బాగున్నాయి. హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్​ కంటే అందంగా కనిపిస్తోంది. ప్రతి చోట ఉన్న పూల మొక్కలు బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగేందుకు చాలా అందంగా ఉంది. - బాలిక, సందర్శకురాలు

సెలవు దినాల్లో మేము ప్రతి సారీ హైదరాబాద్ వెళ్లేవాళ్లం. ఇప్పుడేమో ఇక్కడికి వచ్చాము. చాలా అందమైన వాతావరణం చూస్తున్నాం. పూల మొక్కలు చాలా బాగున్నాయి. నేను మా ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నా. - సందర్శకురాలు

ఇక్కడికి సాయంత్రం రావడం చాలా ఆనందంగా ఉంది. ఫుల్ లైటింగ్, వాకింగ్ ట్రాక్ ఇంకా బాగున్నాయి. లేక్‌ వ్యూ, టెంపుల్ వ్యూ చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసేందుకు బాగుంది. ఇక్కడికి మళ్లీ మళ్లీ రావాలనిపించేలా అందంగా ఉంది. - సందర్శకురాలు

ఇదీ చదవండి: అయోధ్య రామాలయానికి స్పెషల్ డిజైన్- ఏటా ఆ రోజు గర్భగుడిలో అద్భుతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.