మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన వినోద్ రాజ్ అనే ఉపాధ్యాయుడు కరోనా వైరస్ పట్ల మండలంలోని పలు గ్రామాలు తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పద్ధతులు, స్వీయ నియంత్రణ, సామాజిక దూరం వంటి పలు అంశాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు.
మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా సేవలందిస్తున్న వినోద్ రాజ్ లాక్డౌన్ సెలవుల్లో కేసముద్రం మండలంలో గల తండాలు, గ్రామాల్లో విస్తృతస్థాయిలో కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పిస్తున్నాడు. ఈ ప్రచారానికి స్థానిక ఎస్సై సతీష్, ఎంపీపీ చంద్రమోహన్ కలిసి సమకూర్చిన వాహనంలో తిరుగుతూ సమాజం పట్ల తనవంతు బాధ్యత నిర్వర్తిస్తున్నాడు.
ఇదీ చూడండి: వైద్య, పోలీసు సిబ్బందికి పూర్తి వేతనం.. అదనంగా నగదు ప్రోత్సాహకాలు