మహిళలు, బాలికలపై నిమిషానికో అత్యాచారం జరుగుతునే ఉందని.. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళా రచయితలు హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆవులకు ఉన్న రక్షణ మహిళలకు లేకుండా పోయిందన్నారు.
దేశంలో స్త్రీలు.. అందులో బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. ఎక్కడబడితే అక్కడ అత్యాచారాలు జరుగుతునే ఉన్నాయన్నారు. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వాల నుంచి ఏ మాత్రం స్పందన లేదన్నారు.