Parents Sale Infant baby: కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే పోషించే స్థోమత లేక కన్నబిడ్డను విక్రయించే ప్రయత్నం చేసిన దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని ఓ తండాలో పుట్టిన ఆడ శిశువును తల్లిదండ్రులు అమ్మే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండగా మూడో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టడంతో... పోషించే స్థోమత లేక బంధువుల సాయంతో వేరే వాళ్లు విక్రయించేందుకు సిద్ధమయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న చైల్డ్‌లైన్ సిబ్బంది వెంటనే ఆ తండాకు చేరుకొని ఆ పాపను మహబూబాబాద్‌లోని బాల రక్షభవన్‌కు తరలించారు. కుటుంబ సభ్యులందరిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి... ఆ పాపను మళ్లీ తల్లి చెంతకు చేర్చారు.
ఇదీ చదవండి:ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. బంగారం కోసం ప్రాణం తీశాడు