ETV Bharat / city

ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగని భూగర్భ డ్రైనేజీ నిర్మాణం

చారిత్రక నగరిగా... ఆకర్షణీయ నగరంగా పేరుపొందిన ఓరుగల్లులో భూగర్భ డ్రైనేజీకి మాత్రం అడుగులు పడటం లేదు. ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నా... కార్యరూపం దాల్చడం లేదు. నగరానికి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అనేది.. ఓ కలగానే మిగిలిపోతోంది.

no under ground drainage system in Warangal corporation

author img

By

Published : Apr 26, 2021, 5:03 AM IST

హైదరాబాద్ తర్వాత అంతటి పేరుపొందిన నగరంగా వరంగల్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఏళ్లు గడుస్తున్నా అద్భుత నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం మాత్రం ప్రతిపాదనలు దాటి ముందుకు సాగట్లేదు. ఇప్పటికీ పలు చోట్ల మురుగు పేరుకుపోయి... చెత్తాచెదారం దర్శనమిస్తోంది. కాలువల్లో దోమలు, పందుల స్వైరవిహారంతో అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. వర్షాకాలంలో పరిస్థితి దయనీయంగా మారుతోంది. గతేడాది వరదల సమయంలో... నగరంలో మూడొంతులకుపైగా కాలనీలు నీట మునిగిపోయాయి.

1996లో తొలిసారి నగరంలో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించారు. 105 కోట్ల వ్యయవుతుందని అంచనా వేసి... ముందుగా 20 కాలనీలకు ఈ వ్యవస్థను పరిమితం చేశారు. ప్రజల భాగస్వామ్యం ఉండాలని... 2 వేల రూపాయల చొప్పున వసూలు చేశారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ వస్తుందని సంబరపడేలోగా... వసూలు చేసిన డబ్బులు తిరిగిచ్చేశారు. ఆ తర్వాత 2017లోనూ 15వందల7 కోట్ల వ్యయంతో... సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించినా అది పట్టాలెక్కలేదు.

భూగర్భ డ్రైనేజీ వ్యవస్ధ వల్ల... వరదల సమయంలో నగరానికి ముప్పు తప్పుతుంది. దీంతో ప్రజల ఆరోగ్యం కోసం వెచ్చించే ఖర్చూ తగ్గుతుంది. గతంతో పోలిస్తే... అధునాతన సాంకేతికత అందుబాటులోకి రావడంతో... భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం పెద్ద కష్టం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమస్యలు పరిష్కరించి త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని నగర వాసులు కోరుతున్నారు.

గ్రేటర్ వరంగల్‌కు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతిపాదనల దశలో ఉన్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాన్ని... కొత్త పాలకమండలి పూర్తి చేస్తే... భవిష్యత్తులో మురుగు రహిత నగరంగా మారుతుంది.

ఇదీ చూడండి: మినీ పురపోరులో గెలుపే లక్ష్యంగా పార్టీల ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.