వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్లోని ప్రజా గ్రంథాలయంలో జాతీయస్థాయి కథల పోటీల నిర్వహించారు. ముగింపు వేడుకలకు ఎమ్మెల్యే సతీష్ కుమార్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, నటుడు సంపూర్ణేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై... విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. తల్లిదండ్రులు తనకు జన్మనిస్తే... రచయితలు నటుడిగా జన్మనిచ్చారని సంపుర్ణేష్ బాబు అన్నారు. రచయితల మాటలు, పాటల స్ఫూర్తితో ఉద్యమాలు కూడా జరిగాయని తెలిపారు. 1983 పదో తరగతి మిత్రబృందం గ్రంథాలయం ఏర్పాటు చేసి జాతీయ స్థాయి కథల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ముల్కనూర్కు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. గ్రంథాలయంలో బుద్ధుని విగ్రహం జ్ఞానానికి, ప్రశాంతతకు చిహ్నంగా ఉందన్నారు. రాముడి లాగే బుద్ధుడి గుళ్లు వెలిసే పరిస్థితి వచ్చినప్పుడే మనిషి అంతరంగంలో మార్పు వస్తుందన్నారు. తిరుపతికి వెళ్లిన భక్తులకు కలిగే అనుభూతి ముల్కనూరు గ్రంథాలయంలో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కథలు, పాటలు, రచనలు సమాజాన్ని ఉన్నతీకరించే విధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: గ్రామీణ నిరుపేదలకు ఆసరా