కరోనా నిర్మూలనకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టంగా కొనసాగుతుందన్నారు ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య. కరోనా నిర్మూలనకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన మీడియా సమావేశంలో అన్నారు.
ములుగు, ఏటూరు నాగారం ఆసుపత్రులను వెంటిలెటర్తో సహా పూర్తి క్వారంటైన్ సౌకర్యాలను కల్పించామన్నారు. రామప్ప హరితను కూడా క్వారంటైన్ కోసం సిద్ధం చేశామని, జిల్లాలో కరోనా నివారణకు చర్యలు చేపడుతూనే చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
ఇవీ చూడండి: 'ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం.. కరోనాను కట్టడి చేద్దాం