జనగామ జిల్లాలోని రామవరం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు వెళ్తుండగా మార్గమధ్యలో గీత కార్మికులను కలిశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రులు తాటి కల్లు సేవించారు.
శ్రీనివాస్‌గౌడ్ తాగుతున్న సమయంలో మొత్తం తాగితే ఎట్లనయా అంటూ దయాకర్‌రావు సరదాగా అందర్ని నవ్వించారు. ఎర్రబెల్లి ఓ పట్టుపట్టారు. మంత్రులు తమ సంతోషాన్ని గీత కార్మికులతో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమం కోసం కృషిచేస్తున్నారన్నారు మంత్రులు తెలిపారు.
ఇవీ చూడండి: మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి