ETV Bharat / city

సీఎం కేసీఆర్‌ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: కేటీఆర్​ - భాజపా నేతలపై కేటీఆర్​ ఫైర్​

వరంగల్​ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్​... భాజపా నేతలపై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌ వయసు, హోదా చూడకుండా భాజపా నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్న కేటీఆర్​... ఇదే చివరి హెచ్చరిక అని తేల్చి చెప్పారు.

ktr
minister ktr fire on bjp leaders for scolding cm kcr
author img

By

Published : Apr 12, 2021, 5:19 PM IST

ఉగాదికి ఒకరోజు ముందే వరంగల్‌కు తాగునీరు అందించామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ వయసు, హోదా చూడకుండా భాజపా నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్న కేటీఆర్​... ఇదే చివరి హెచ్చరిక అన్నారు. వరంగల్‌ నగరానికి మెట్రో నియో రైలు తీసుకొచ్చేది తామేనని స్పష్టం చేశారు. మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

వరంగల్‌ నగరాభివృద్ధికి ఎన్ని కోట్లు ఇచ్చామో శ్వేతపత్రం విడుదల చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. తామిచ్చిన డబ్బుకు రెట్టింపు కేంద్రం నుంచి తీసుకురాగలరా అని భాజపా నేతలకు సవాల్​ విసిరారు. మోదీ ఇచ్చిన ప్రభుత్వ కొలువులెన్ని.. అమ్మిన సంస్థలు ఎన్నో చెప్పాలని డిమాండ్​ చేశారు.

నిరుద్యోగి సునీల్‌ను రెచ్చగొట్టి తప్పుదారి పట్టించారని కేటీఆర్ ఆరోపించారు. దయచేసి యువతను గందరగోళానికి గురి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర యువకులు క్షణికావేశానికి గురి కావద్దని కోరారు. త్వరలోనే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.

సీఎం కేసీఆర్‌ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: కేటీఆర్​

ఇదీ చూడండి: ఫ్యూచర్​ సిటీగా వరంగల్​ను మారుస్తాం​: మంత్రి కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.