ETV Bharat / city

మినీపోల్స్​: కొత్త మేయర్లు, మున్సిపల్​ ఛైర్​పర్సన్ల ఎన్నిక ఏడునే - నోటిఫికేషన్

వరంగల్, ఖమ్మం మేయర్లు సహా మరో ఐదు పట్టణాల మున్సిపల్ ఛైర్​పర్సన్లు ఎవరన్నది ఏడో తేదీన తేలనుంది. పరోక్ష ఎన్నిక కోసం కొత్తగా పాలకమండళ్ల ప్రత్యేక సమావేశ తేదీని ఖరారు చేస్తూ... రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. కొవిడ్ నిబంధనలకు లోబడి పరోక్ష ఎన్నిక ప్రక్రియ జరగనుంది. ఎన్నికైన సభ్యుల్లో ఎవరికైనా... కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయి క్వారంటైన్​లో ఉంటే వారు వీడియోకాల్ ద్వారా ప్రమాణస్వీకారం చేయడంతో పాటు మేయర్, ఛైర్ పర్సన్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే వెసులుబాటును ఎస్ఈసీ కల్పించింది.

mayor and municipal chairpersons elections on seventh

author img

By

Published : May 5, 2021, 7:42 PM IST

మినీ పురపోరులో భాగంగా మేయర్, ఛైర్ పర్సన్ పదవుల కోసం పరోక్ష ఎన్నికలు ఈ నెల ఏడో తేదీన జరగనున్నాయి. ఇందు కోసం రెండు నగరపాలికలు, ఐదు పురపాలికల పాలకమండళ్ల ప్రత్యేక సమావేశాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాల్టీలకు ఏప్రిల్ 30న పోలింగ్ జరగ్గా... ఈ నెల మూడున ఓట్ల లెక్కింపు పూర్తైంది. ఆయా కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాల్టీల ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ల ఎన్నిక కోసం ఏడున పరోక్ష ఎన్నిక నిర్వహించనున్నారు.

ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్లు నియమించిన గెజిటెడ్ అధికారులు ఆరో తేదీలోగా ఎన్నిక నోటీసు జారీ చేస్తారు. ఏడో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఆ తర్వాత మూడున్నరకు ఎన్నిక ప్రక్రియ చేపడతారు. మేయర్, ఛైర్ పర్సన్ ఎన్నిక పూర్తైతేనే... డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక చేపడతారు. ఏదైనా కారణాల వల్ల పరోక్ష ఎన్నిక జరగకపోతే మరుసటి రోజు ఎనిమిదో తేదీన మరలా ఎన్నిక నిర్వహిస్తారు.

కరోనా నిబంధనలకు లోబడి...

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పరోక్ష ఎన్నికను పూర్తిగా కొవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సమావేశ మందిరంలో ముందు రోజు, ఎన్నిక రోజు రసాయనాలు పిచికారీ చేయాలని... మాస్కు లేనిదే ఎవరినీ లోపలికి అనుమతించరాదని స్పష్టం చేసింది. సమావేశ మందిరంలో భౌతికదూరం ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, శానిటైజర్లు ఏర్పాటు చేయాలని తెలిపింది. పెద్ద హాళ్లు అందుబాటులో లేకపోతే బయట శామియానాల కింద కూడా ప్రత్యేక సమావేశం, ఎన్నిక నిర్వహించేందుకు ఎస్ఈసీ అనుమతిచ్చింది. ప్రతి ఒక్కరికీ మాస్కు, శానిటైజర్, ఫేస్ షీల్డ్, హ్యాండ్ గ్లౌజులను అందించాలని... వైద్య, ఆరోగ్యశాఖ నుంచి ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించింది. ప్రత్యేక సమావేశ విధుల్లో ఉండే వారంతా కొవిడ్ నెగెటివ్ నిర్ధరణ కావాలని స్పష్టం చేసింది. ఎన్నికైన సభ్యులందరినీ ఒకేసారి ప్రమాణం చేయించాలని తెలిపింది.

క్వారంటైన్​లో ఉన్నవారి కోసం...

ఎవరైనా ఎన్నికైన సభ్యులు కొవిడ్ బారినపడి క్వారంటైన్​లో ఉంటే... వీడియో కాల్ ద్వారా ప్రమాణం చేయడంతో పాటు ఓటింగ్​లో పాల్గొనే అవకాశం కల్పించాలని... దీన్ని ప్రిసైడింగ్ అధికారి మొబైల్ ఫోన్లో రికార్డు చేయాలని ఎస్​ఈసీ ఆదేశించింది. సమావేశంలో... ఎన్నిక ముందు, తర్వాత ఎలాంటి దండలు వేయటం, శాలువాలు కప్పటం, పుష్పగుచ్ఛాలు ఇవ్వడం చేయరాదని స్పష్టం చేసింది. సమావేశం జరుగుతున్న సమయంలో బయట జనం గుమిగూడరాదని, పూర్తయ్యాక ఎటువంటి ర్యాలీలు చేయరాదని ఎస్ఈసీ తెలిపింది.

పరోక్ష ఎన్నిక కోసం ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించింది. గ్రేటర్ వరంగల్​కు కిషన్, ఖమ్మంకు అహ్మద్ నదీం, అచ్చంపేటకు మహేశ్ దత్ ఎక్కా పరిశీలకులుగా ఉంటారు. సిద్దిపేటకు వాసం వెంకటేశ్వర్లు, నకిరేకల్​కు వాకాటి కరుణ, జడ్చర్లకు సుదర్శన్ రెడ్డి, కొత్తూరుకు శ్రీధర్​ను పరిశీలకులుగా ఎస్​ఈసీ నియమించింది.

ఇదీ చూడండి: చేతులు పదేపదే కడుగుతున్నారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.