వరంగల్ నగరంలోని లేబర్ కాలనీకి చెందిన భరద్వాజ్ అనే వ్యక్తి తన భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్యాయత్నం చేశాడు. సెల్ టవర్ ఎక్కి హల్చల్ సృష్టించాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ దేవేందర్ భరద్వాజ్‌కు నచ్చజెప్పగా.. అతను టవర్ నుంచి కిందకు దిగాడు.
మద్యం మత్తులోనే భరద్వాజ్ సెల్ టవర్ ఎక్కినట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ భరద్వాజ్.. ఎనుమాముల వద్ద ఉన్న విద్యుత్ హైటెన్షన్ స్తంభం ఎక్కినట్లు వెల్లడించారు.
- ఇదీ చూడండి: పురపాలక శాఖ అధికారులు బాగా పనిచేశారు: కేసీఆర్