ఉత్తర తెలంగాణకు తలమానికమైన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలపై రాష్ట్ర మానవ హక్కుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సందర్శించిన మానవ హక్కుల బృందం... పలు విభాగాలను సందర్శించింది.
రోగులతో మాట్లాడిన బృందసభ్యులు... వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలు, కావాల్సిన సౌకర్యాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆస్పత్రి కార్యనిర్వాహక అధికారిని కోరారు. దేశ వ్యాప్తంగా మానవ హక్కుల కమిషన్కు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఛైర్మన్గా ఉంటాడని.. వారి సూచనల మేరకే హెచ్చార్సీ పనిచేస్తుందని సభ్యులు తెలిపారు.