ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానం-2020... చరిత్రలో నిలిచిపోనుందని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో చైతన్య విశ్వవిద్యాలయాన్ని దృశ్య మాధ్యమంలో ప్రారంభించారు.
విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఒక ప్రామాణిక విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలని దత్తాత్రేయ సూచించారు. భవిష్యత్ చైతన్య విశ్వవిద్యాలయం ఒక ప్రపంచ ర్యాంక్ గల విద్యాసంస్థగా రూపొందాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ పురుషోత్తం రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.