ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు.. విశ్వనాథ్ కాలనీలో 50 ఫీట్ల రహదారిని ఆక్రమించి నిర్మాణం చేపట్టిన ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ దామోదర్ యాదవ్ ఇంటిని నేలమట్టం చేశారు. కేటీఆర్కు అదే కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన అధికారులు భారీ బందోబస్తు నడుమ జేసీబీ సహాయంతో కూల్చేశారు. రహదారికి అడ్డంగా ఉన్న భవనాన్ని తొలగించడంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.
రహదారి ఆక్రమణకు గురవుతుందని అదే కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగి కేటీఆర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి అధికారులు వచ్చారు. ఫిర్యాదుదారుడిని చంపుతానని కార్పొరేటర్ దామోదర్ యాదవ్ వారి ముందే భయపెట్టాడు. తాజాగా వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ చొరవతో ఆ ఇల్లును నేలమట్టం చేశారు. మరో ఐదు ఇళ్లకు కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఇదీ చూడండి: తెరాస నాయకుడిపై ట్విట్టర్లో ఫిర్యాదు.. స్పందించిన మంత్రి కేటీఆర్