Errabelli on Mission Bagiradha Awards: రాష్ట్రంలో ప్రజలకు తాగునీరందించే మిషన్ భగీరధ పథకం...దేశంలోనే మేటి పథకంగా నిలిచి అన్ని రాష్ట్రాల వారికి ఆదర్శంగా నిలుస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేంద్రం నిధులివ్వకున్నా.. ముఖ్యమంత్రి గట్టి సంకల్పంతో ఈ పథకాన్ని విజయవంతం చేశారని తెలిపారు. మిషన్ భగీరధ పథకానికి జాతీయ స్ధాయి అవార్డు రావడంలో కృషి చేసిన ఇంజినీర్లకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ అవార్డులు అందించారు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన 94 మందికి ఈ పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంటూ దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీరు ఇచ్చి దేశంలోనే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో తాగునీటి బాధను తీర్చిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమం చూసి స్ఫూర్తి పొందే.. తాను తెరాసలో చేరినట్లు తెలిపారు. నూటికి నూరు శాతం ఇంటింటికీ నల్లాల ద్వారా మంచి నీరందించే రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. కేంద్రమంత్రులే పార్లమెంటులో ఈ పథకాన్ని కొనియాడారని అన్నారు.
గుజరాత్‌లో సర్కార్ బోరు నీళ్లిస్తుంటే.. తెలంగాణ సర్కార్ స్వచ్ఛమైన నీటిని ఇంటింటికీ అందిస్తోందని తెలిపారు. అవార్డు గ్రహీతలకు స్మితా సబర్వాల్ అభినందనలు తెలిపారు. యువ ఇంజినీర్లు పురస్కార గ్రహీతలను స్ఫూర్తిగా తీసుకుని పని చేయాలని కోరారు. అంతకుముందు కార్యాలయంలో మిషన్ భగీరథ ద్వారా నీరు శుభ్రమవుతున్న విధానాన్ని పరిశీలించారు.
ఇవీ చదవండి: