వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో దేశీ రకం మిర్చి ధర బంగారంతో పోటీపడి పరుగులు తీస్తోంది. తన రికార్డులు తానే అధిగమిస్తోంది. ఈ నెల 3న క్వింటా రూ.32,000 పలికిన ఈ మిర్చి సోమవారం ఏకంగా రూ.35,000కు చేరింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామానికి చెందిన బి.రాజేశ్వరరావు 40 బస్తాల దేశీ రకం మిర్చిని మార్కెట్కు తీసుకొచ్చారు.
దీన్ని దుర్గాభవాని అడ్తి వ్యాపారి ద్వారా లక్ష్మీసాయి ట్రేడర్స్ ఖరీదుదారు రూ. 35000 ధరకు కొనుగోలు చేశారు. రంగులు, సుగంధద్రవ్యాలు, పచ్చళ్లు, నూనె తయారీలో దేశీ రకం మిర్చిని విరివిగా వినియోగిస్తుండటంతో అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఏర్పడిందని మార్కెట్ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: