భారీ వర్షాలతో రాష్ట్రంలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్లోని చెరువులు, కుంటలు కబ్జా చేసి అక్రమ కట్టడాలు చేయడం వల్లే వర్షపు నీరు ముంచెత్తిందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుందని...దీని వెనక రాజకీయ నాయకుల అండ ఉందన్నారు.
వరంగల్ నగరానికి వెయ్యి కోట్లు కేటాయించాలన్నారు. అక్రమ కట్టడాలు తొలగించి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి పరచాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు చాడా సూచించారు.