cool bricks: వేసవిలో ఇంట్లో నాలుగ్గోడల మధ్య ఉండాలంటే భరించలేనంత వేడితో అల్లాడిపోతుంటాం. ఈ నేపథ్యంలో వేసవి పూట ఇళ్లు చల్లగా ఉండటానికి వరంగల్ ఎన్‌ఐటీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శశిరాం ప్రత్యేక ఇటుకలను రూపొందించి భారత ప్రభుత్వం నుంచి పేటెంటు పొందారు.
బొగ్గు నుంచి తయారైన బూడిదను తక్కువగా వినియోగించి, వ్యవసాయ వ్యర్థాలు, కలప మిశ్రమం కలిపి తక్కువ ఖర్చుతో వీటిని రూపొందించారు. వీటిని ‘కో ఫైర్డ్ బ్లెండెడ్ యాష్ బ్రిక్స్’ అని పిలుస్తారు. సాధారణంగా మట్టితో చేసిన ఎరుపు ఇటుకల్లో ఉష్ణవాహకం మెట్రిక్ కెల్విన్‌లో 1.2 వాట్ వరకు ఉంటే.. వీటిలో 0.5 ఉష్ణవాహకం మాత్రమే ఉంటుందని, దీని వల్ల వేడి తగ్గి గది చల్లగా ఉంటుందని అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలిపారు. ఈ పరిశోధనను నాగ్‌పుర్‌లోని వీఎన్‌ఐటీలో తన పీహెచ్‌డీలో భాగంగా చేశానని, 2017లో దరఖాస్తు చేసుకుంటే ఇటీవలే పేటెంటు వచ్చిందని డా.శశిరాం వివరించారు.
ఇదీచూడండి: KTR in Assembly: 'మున్సిపాలిటీలకు ఈ ఏడాది మాస్టర్ ప్లాన్ రూపొందిస్తాం'