Bandi Sanjay On KCR: సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల కేటాయింపు సరిగా లేదని ఆరోపించారు. వరంగల్ జిల్లా బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ తరగతుల చివరిరోజు బండి సంజయ్ హాజరయ్యారు. నాడు జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని సంజయ్ ఆరోపించారు. సీనియర్, జూనియర్ అంటూ ఉద్యోగుల మధ్య విభజన సృష్టించారని ఆరోపించారు.
'సీఎం అనాలోచిత నిర్ణయాల వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగుల కేటాయింపు శాస్త్రీయంగా లేదు. సీనియర్. జూనియర్ పేరుతో ఉద్యోగుల మధ్య విభజన సృష్టించారు. అభ్యంతరాలను పరిశీలించే సమయం కూడా కేసీఆర్కు లేదు. జిల్లాల విభజన కూడా శాస్త్రీయంగా జరగలేదు.'
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీచూడండి: KTR On Textiles GST: 'రైతుల మాదిరిగానే నేతన్నలు కేంద్రంపై తిరగబడతారు'