ETV Bharat / city

'ధైర్యం ఉంటే వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు పెట్టాలి' - బండి సంజయ్ వరంగల్ టూర్

వరంగల్ అభివృద్ధిని తెరాస ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని.. భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ధైర్యం ఉంటే వరంగల్‌లో ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. వరంగల్‌ కార్పొరేషన్‌లో భాజపా విజయం ఖాయమని స్పష్టం చేశారు.

'ధైర్యం ఉంటే వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు పెట్టాలి'

author img

By

Published : Jan 6, 2021, 3:35 AM IST

ధైర్యం ఉంటే వరంగల్‌లో ఎన్నికలు పెట్టాలి: బండి సంజయ్

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఇచ్చిన జోష్‌తో వరంగల్‌, ఖమ్మం పురపాలక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భాజపా భావిస్తోంది. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు మంగళవారం వరంగల్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విస్తృతంగా పర్యటించారు. కాజీపేట నుంచి వరంగల్‌ వరకూ భారీ రోడ్‌ షో నిర్వహించారు. సంజయ్‌కు ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు, అభిమానులు...పార్టీ జెండాలతో నగర వీధులను కాషాయమయం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో... రాష్ట్రం పూర్తిగా అథోగతి పాలైందని సంజయ్ విమర్శించారు. నిర్ణయాలను వెనక్కితీసుకుంటూ.. యూ టర్న్ ముఖ్యమంత్రిగా మారారాని ఆక్షేపించారు. నిరుద్యోగులకు ఇస్తానన్న భృతి ఏమైందో సీఎంను నిలదీయాలన్నారు. వరంగల్‌లో భాజాపా గెలుపు ఖాయమనే ఎన్నికలు నిర్వహించడం లేదని దుయ్యబట్టారు.

శ్వేతపత్రం విడుదల చేయాలి..

వరంగల్‌ అభివృద్ధిని తెరాస సర్కారు పూర్తిగా విస్మరించిందని బండి సంజయ్‌ విమర్శించారు. కేంద్ర నిధులన్నీ పక్కదారి పట్టించారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులు కాకుండా... వరంగల్ అభివృద్ధికి రాష్ట్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని బండి డిమాండ్ చేశారు.

ప్రమాణం చేయాలి..

వరంగల్‌ జిల్లాలో తెరాస నాయకులంతా అవినీతికి పాల్పడ్డారని బండి సంజయ్‌ ఆరోపించారు. ఏ తప్పూ చేయకుంటే 48 గంటల్లో భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్‌ విసిరారు.

బండి సంజయ్ పర్యటన వరంగల్ కమల దళంలో జోష్ నింపింది. సంజయ్ సమక్షంలో పలువురు కాషాయ కండువా కప్పుకున్నారు.

ఇవీ చూడండి: నెల గడిచినా కొత్త మేయర్‌ లేరు: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.