ప్రకృతి అందాలకు, సాహస కృత్యాలకు నెలవైన పాండవుల గుట్టల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం పర్యటించారు. సతీ సమేతంగా పాండవుల గుట్ట మొత్తం తిరిగిన ఆయన ప్రకృతి అందాలకు ముగ్ధుడయ్యారు. పాండవుల గుట్ట, కుంతీ గుహ, పోతరాజు చెలిమ, జారుడు బండలు, మేకల బండలను ఆసక్తిగా తిలకించారు. ఆయా ప్రాంతాల విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
పాండవుల గుట్టల్లోని ఆది మానవుల కాలానికి చెందిన రాక్ ఆర్ట్స్, బుగులోని జాతర ప్రదేశాలలో పర్యటించారు. పాండవుల గుట్ట, చిన్న తిరుపతి గుట్టల పైకి కలెక్టర్ ఉత్సాహంగా రాక్ క్లైంబింగ్ చేశారు. పాండవుల గుట్ట మంచి పర్యాటక ప్రాంతమని, ఆ ప్రాంతాన్ని మంచి టూరిస్ట్ స్పాట్‌గా మారిస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. పాండవుల గుట్టకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చెందేలా దృష్టి కేంద్రీకరిస్తానన్నారాయన.
ఇదీ చూడండి : ఆ ఊళ్లో మద్యం అమ్మితే రూ.10వేలు కట్టాల్సిందే..!