తనకు న్యాయం చేయాలని కోరుతూ వరంగల్‌లో ఓ మహిళ ఆందోళన చేపట్టింది. ఇంట్లో భర్తతో పాటు అత్త మామలు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ... హన్మకొండలోని అశోక్‌నగర్‌లో భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగింది. అశోకనగర్కు చెందిన భూక్య బాలరాజుతో నిర్మలకు పెళ్లి జరిగింది. వివాహం జరిగిన నుంచి అత్తమామలతో పాటు భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది.
తనకు ఆడపిల్ల పుట్టడం వల్ల కష్టాలు మరిన్ని ఎక్కువయ్యాయని బాధితురాలు వాపోయింది. ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో తనను ఇంటి నుంచి బయటకు పంపించేశారని ఆవేదన వ్యక్తం చేసింది. సమాచారం తెలుసుకుని ఘటన స్థలికి చేరుకుని... ఇరు కుటుంబాలను సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.