సోమవారం రాత్రి సిద్దిపేట జిల్లాలో పడిన వడగండ్ల వానకు పంటలు, మామిడి తోటలు బాగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని నంగునూరు మండలంలోని పలు గ్రామాల్ని ఎమ్మెల్యే హరీశ్‌రావు పర్యటించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. నష్టంపై సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరూ బాధపడవద్దని... అందరికీ తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండిః సమయం లేదు మిత్రమా మిగిలింది ఈ ఒక్క రోజే