పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా వ్యాప్తితో సింగరేణి కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. కార్మికులకు వైరస్ సోకి వరుసగా మరణించగా విధులకు హాజరయ్యేందుకు జంకుతున్నారు.
ఈ మేరకు రామగుండం అర్జీ-1 ఏరియాలోని సింగరేణి రెండో బొగ్గు గనిపై సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. సింగరేణి యాజమాన్యం వెంటనే లాక్డౌన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు యాజమాన్యం.. కార్మికులకు ఎలాంటి లక్షణాలున్నా విధులకు హాజరు కావద్దని కోరుతున్నారు. హోం క్వారంటైన్లో ఉన్నవారికి స్పెషల్ లీవ్ ఇస్తామని తెలిపారు. సింగరేణి కార్మికులెవరూ ఆందోళన చెందవద్దని... వైరస్ కట్టడి కోసం యాజమాన్యం అన్ని చర్యలు చేపట్టిందని సింగరేణి అధికారులు వివరించారు.